కార్లు, ఆటోలకు కంప్రెస్డ్‌ బయోగ్యాస్‌
close

ప్రధానాంశాలు

కార్లు, ఆటోలకు కంప్రెస్డ్‌ బయోగ్యాస్‌

ఈనాడు, హైదరాబాద్‌: కార్లు, ఆటోల్లో ఇంధనంగా కంప్రెస్డ్‌ బయోగ్యాస్‌(సీబీజీ) అందుబాటులోకి వచ్చింది. సీఎన్‌జీ వాహనదారులు సీబీజీ వాడితే మరింత మైలేజీతోపాటు పర్యావరణ అనుకూలంగా ఉంటుందని ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ తెలిపింది. ఈ సంస్థ తెలంగాణలో తొలి సీబీజీ స్టేషన్‌ను ఇటీవల హైదరాబాద్‌ అత్తాపూర్‌లో ప్రారంభించింది. వివిధ వ్యర్థాల నుంచి ఉత్పత్తి చేసే బయోగ్యాస్‌ని సీబీజీగా మార్చి వాహనాల్లో ఉపయోగించేందుకు పునరుత్పాదక ఇంధనంగా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇందులో 92-98 శాతం వరకు మీథేన్‌ ఉంటుంది. సిలిండర్ల ద్వారా పెట్రోలు పంపులకు సరఫరా చేస్తారు. ఇప్పటికే హైదరాబాద్‌ బాలానగర్‌లో కోళ్ల వ్యర్థాలతో ప్రతిరోజు 2.4 టన్నుల సీబీజీ ఉత్పత్తి చేసే ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. దేశంలో 62 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల సీబీజీ ఉత్పత్తి సామర్థ్యముందని అంచనా.  ‘‘వ్యవసాయ, మున్సిపల్‌ వ్యర్థాలను వృథాగా కాల్చకుండా.. సీబీజీ ఉత్పత్తికి వినియోగించడం ద్వారా కాలుష్య నివారణ, రైతులకు అదనపు ఆదాయం తదితర ప్రయోజనాలు కలగనున్నాయి. వాహనదారులకు కూడా పెట్రోలు ఖర్చుతో పోలిస్తే సీబీజీతో 50 శాతం ఇంధన ఖర్చులు ఆదా అవుతాయి’’ అని నిపుణులు చెబుతున్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని