ముందు జాగ్రత్తలే శ్రీరామరక్ష
close

ప్రధానాంశాలు

ముందు జాగ్రత్తలే శ్రీరామరక్ష

కొవిడ్‌-19పై ఎన్‌ఎస్‌యూఐ అవగాహన సదస్సులో వైద్యులు

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడంతోపాటు మాస్కు ధరించడం, టీకా వేయించుకోవడం తదితర ముందు జాగ్రత్తలతో కరోనా మూడో దశ ముప్పు నుంచి సురక్షితంగా బయటపడొచ్చని గాంధీ ఆసుపత్రి సీనియర్‌ వైద్యుడు డాక్టర్‌ హేమంత్‌ కల్కుంట్ల తెలిపారు. తెలంగాణ ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు వెంకట్‌ బల్మూరి నేతృత్వంలో శనివారం కొవిడ్‌-19, బ్లాక్‌ ఫంగస్‌లపై అవగాహన సదస్సు జరిగింది. జూమ్‌ కాల్‌ ద్వారా జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్‌ హేమంత్‌తో పాటు డాక్టర్‌ రోహిత్‌ స్టీఫెన్‌, డాక్టర్‌ రాహుల్‌ డేవిడ్‌ తదితరులు పాల్గొని సూచనలిచ్చారు. పోస్ట్‌ కొవిడ్‌, డయాబెటిక్‌ రోగులు,  రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారు చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. ఒకే మాస్కును పదేపదే ధరించడం మంచిది కాదని వైద్యులు చెప్పా రు. బ్లాక్‌ ఫంగస్‌ లక్షణాలను ముందుగానే గుర్తించడం చాలా కీలకమన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని