దత్తాత్రేయకు జన్మదిన శుభాకాంక్షలు
close

ప్రధానాంశాలు

దత్తాత్రేయకు జన్మదిన శుభాకాంక్షలు

ఈనాడు, హైదరాబాద్‌, ఈనాడు డిజిటల్‌, అమరావతి: హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయకు పలువురు ప్రముఖుల జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రపతి కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, తెలంగాణ గవర్నర్‌ తమిళిసై, ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఫోన్‌చేసి ఆయురారోగ్యాలతో ఉండాలంటూ ఆకాంక్షించారు. సిమ్లాలోని రాజ్‌భవన్‌లో శనివారం జరిగిన దత్తాత్రేయ 74వ జన్మదిన వేడుకల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జైరాంఠాకూర్‌, మంత్రులు పాల్గొన్నారు.
దత్తాత్రేయ తెలుగువారిని మరువరు: చంద్రబాబు
బండారు దత్తాత్రేయకు తెదేపా అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌లు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా ఆయన అందరినీ సోదరభావంతో ఆప్యాయంగా ఆదరిస్తారన్నారు. ఎక్కడ ఉన్నా తెలుగువారిని, తెలుగునేలను మరవని దత్తాత్రేయ నిండు నూరేళ్లూ ఆనంద, ఆరోగ్యాలతో జీవించాలని కోరుకుంటున్నట్లు చంద్రబాబు ట్వీట్‌ చేశారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని