ప్రిన్సిపల్‌తో మాట్లాడిన ఉపరాష్ట్రపతి
close

ప్రధానాంశాలు

ప్రిన్సిపల్‌తో మాట్లాడిన ఉపరాష్ట్రపతి

కరోనాపై అవగాహన కల్పిస్తున్నందుకు అభినందనలు

వీణవంక, న్యూస్‌టుడే: కరోనాపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, వారి అనుమానాలను నివృత్తి చేస్తున్న  కరీంనగర్‌ జిల్లా వీణవంక మండలం గన్ముకుల ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డికి శనివారం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఫోన్‌ చేసి అభినందించారు. హుజూరాబాద్‌ మండలం సిర్సపల్లి గ్రామానికి చెందిన వేణుగోపాల్‌రెడ్డి 2013 నుంచి ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్‌గా పని చేస్తున్నారు. గత 15 నెలలుగా కరోనా గురించి 300 వరకు వ్యాసాలు రాసి సోషల్‌ మీడియా, ఎలక్ట్రానిక్‌, ప్రింట్‌ మీడియా ద్వారా ప్రచారం చేశారు. వీటి గురించి తెలుసుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. శనివారం ఉదయం తనకు ఫోన్‌ చేసి.. ‘కరోనా నియంత్రణకు మనోధైర్యం ఎంతో అవసరం.. మీ వీడియోలలో అంశాలు చాలా బాగున్నాయి’ అని అభినందించారని వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని