యాదాద్రి జిల్లా కలెక్టర్‌ బదిలీ
close

ప్రధానాంశాలు

యాదాద్రి జిల్లా కలెక్టర్‌ బదిలీ

వరంగల్‌ నగర పాలక సంస్థ కమిషనర్‌కు కలెక్టర్‌గా పదోన్నతి

ఈనాడు, హైదరాబాద్‌: యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌ అనితా రామచంద్రన్‌ను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం రాత్రి ఉత్తర్వులిచ్చింది. ఆమె స్థానంలో వరంగల్‌ నగరపాలక సంస్థ కమిషనర్‌ పమేలా సత్పథిని జిల్లా కలెక్టర్‌గా నియమించింది. ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పల్లె, పట్టణప్రగతిలపై అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులతో సమావేశం అనంతరం ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. అనితారామచంద్రన్‌కు మళ్లీ పోస్టింగు ఇవ్వలేదు. మరోవైపు వరంగల్‌ నగరపాలక సంస్థకు కొత్త కమిషనర్‌ను నియమించలేదు.
20, 21 తేదీల్లో కలెక్టరేట్‌ భవనాలను ప్రారంభించనున్న సీఎం
ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ నెల 20, 21 తేదీల్లో మూడు జిల్లాల్లో కలెక్టరేటు భవన సముదాయాలు, పోలీసు కార్యాలయాలను ప్రారంభించనున్నారు. 20న కామారెడ్డి, సిద్దిపేటలో  నిర్వహించే కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. 21న వరంగల్‌లో నూతన కలెక్టరేటు ప్రారంభంతో పాటు సెంట్రల్‌ జైలు స్థలంలో నిర్మించనున్న సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి భవన నిర్మాణాలకు సీఎం శంకుస్థాపన చేస్తారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని