జడ్జి రామకృష్ణకు బెయిల్‌ మంజూరు

ప్రధానాంశాలు

జడ్జి రామకృష్ణకు బెయిల్‌ మంజూరు

ఈనాడు, అమరావతి: జడ్జి ఎస్‌ రామకృష్ణకు ఏపీ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.రఘునందన్‌రావు మంగళవారం ఈ మేరకు ఆదేశాలిచ్చారు. ఈ కేసుకు సంబంధించి మీడియా ముందు వ్యాఖ్యలు చేయవద్దని జడ్జి రామకృష్ణకు స్పష్టం చేశారు. దర్యాప్తు అధికారులు కోరినప్పుడు విచారణకు హాజరుకావాలని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణతో రాజద్రోహం కేసులో అరెస్ట్‌ అయిన జడ్జి ఎస్‌ రామకృష్ణ హైకోర్టులో బెయిలు పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. పిటిషనర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపిస్తూ.. ముఖ్యమంత్రిపై పిటిషనర్‌ చేసిన వ్యాఖ్యలు రాజద్రోహం నేరం కిందకు రావన్నారు. ఏప్రిల్‌ 15న జడ్జి రామకృష్ణను పోలీసులు అరెస్ట్‌ చేశారన్నారు. 60 రోజులకు పైగా జైల్లో ఉన్నారన్నారు. బెయిల్‌ మంజూరు చేయాలని కోరారు. పోలీసుల తరఫున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ (పీపీ) శ్రీనివాసరెడ్డి వాదిస్తూ.. పిటిషనర్‌ పబ్లిక్‌ సర్వెంట్‌ అయి టీవీ చర్చా కార్యక్రమాల్లో పాల్గొనడం సర్వీసు నిబంధనలకు విరుద్ధమని, ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పారు.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని