తొలి ఏడాది మార్కులే ద్వితీయకూ?
close

ప్రధానాంశాలు

తొలి ఏడాది మార్కులే ద్వితీయకూ?

సిఫార్సు చేసిన కమిటీ!
ప్రభుత్వానికి ఇంటర్‌ విద్య విధివిధానాల నివేదిక

ఈనాడు, హైదరాబాద్‌: ఇంటర్‌మీడియట్‌ ద్వితీయ సంవత్సర ఫలితాల వెల్లడికి సంబంధించి కమిటీ రూపొందించిన విధివిధానాల నివేదికను ఇంటర్‌బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ మంగళవారం విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియాకు సమర్పించారు. ద్వితీయ ఇంటర్‌ పరీక్షలను రద్దుచేసిన ప్రభుత్వం.. విద్యార్థులకు ఏ ప్రాతిపదికన మార్కులు కేటాయించాలన్నది నిర్ణయించేందుకు కమిటీని నియమించటం తెలిసిందే. ప్రథమ సంవత్సర మార్కులనే రెండో ఏడాదిలో ఇచ్చేలా కమిటీ సిఫారసు చేసినట్లు సమాచారం. నివేదికను ప్రభుత్వం ఆమోదిస్తే ఇంటర్‌బోర్డు ఫలితాలను ప్రకటించనుంది. ప్రాక్టికల్‌ మార్కులను తెప్పించుకోవడం, మిగిలిన సాంకేతిక ప్రక్రియను పూర్తిచేయడానికి వారం, పది రోజులు పట్టే అవకాశం ఉందని ఇంటర్‌బోర్డు వర్గాలు తెలిపాయి.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని