మహమ్మారి వేళ మహోపకారం..!
close

ప్రధానాంశాలు

మహమ్మారి వేళ మహోపకారం..!

ఏడు వేల మంది పేదలు, నిరాశ్రయులు, హిజ్రాలకు హైదరాబాద్‌ పోలీసులు ఉచితంగా టీకాలు వేయించారు. బంజారాహిల్స్‌లోని సుల్తాన్‌-ఉల్‌-ఉలుం విద్యా సంస్థలో మంగళవారం ఏర్పాటు చేసిన ‘మెగా వ్యాక్సిన్‌ డ్రైవ్‌’ ఇందుకు వేదికైంది. మేఘా ఇంజినీరింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ కంపెనీ టీకాలు కొనివ్వగా.. వైద్యులు, నర్సింగ్‌ సేవలను రెయిన్‌బో ఆసుపత్రి సమకూర్చింది. వ్యాక్సిన్‌ వేయించుకునేందుకు వచ్చిన వారందరికీ అల్పాహారం, భోజనం కూడా అందించారు. ఈ కార్యక్రమాన్ని హోంమంత్రి మహమూద్‌ అలీ, ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, మాగంటి గోపీనాథ్‌, మేఘా ఇంజినీరింగ్‌ సంచాలకులు శ్రీనివాసరెడ్డి, రెయిన్‌బో ఆసుపత్రి ఎండీ డాక్టర్‌ కె.రమేష్‌, సుల్తాన్‌-ఉల్‌-ఉలుం విద్యాసంస్థల గౌరవ కార్యదర్శి జఫర్‌జావేద్‌, కొత్వాల్‌ అంజనీకుమార్‌, పోలీసు అధికారులు షికా గోయల్‌, అనిల్‌కుమార్‌ తదితరులు పరిశీలించారు.

- ఈనాడు, హైదరాబాద్‌Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని