నల్లమల అడవుల్లో కాలాముఖ ఆలయం
close

ప్రధానాంశాలు

నల్లమల అడవుల్లో కాలాముఖ ఆలయం

ఈనాడు, హైదరాబాద్‌: శైవమత శాఖల్లో ఒకటైన కాలాముఖ దేవాలయాన్ని నల్లమల అటవీప్రాంతంలో గుర్తించినట్లు తెలంగాణ కొత్త చరిత్ర బృందం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఆలయం, విగ్రహాలు 10-12వ శతాబ్దం నాటివని బృందం కన్వీనర్‌ శ్రీరామోజు హరగోపాల్‌ పేర్కొన్నారు. నల్గొండ జిల్లా చందంపేట మండలం దేవరచర్లకు 4 కి.మీ.ల దూరంలో నల్లమల అడవుల్లోని కొండచరియల్లో ఈ శివాలయం ఉందన్నారు. కాలాముఖులు శ్రీశైలాన్ని కేంద్రంగా చేసుకుని కార్యకలాపాలు నిర్వహించారని చెబుతారు. ఈ గుడిలో రాతిస్తంభం మీద చెక్కిన శివలింగం, ఎదురుగా కాలాముఖాచార్యుడు అంజలి ఘటించి కూర్చున్న శిల్పం తమ క్షేత్రపర్యటనలో కనిపించాయని వివరించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని