వరి సాగులో తెలంగాణ ప్రథమం: పల్లా
close

ప్రధానాంశాలు

వరి సాగులో తెలంగాణ ప్రథమం: పల్లా

మేడ్చల్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో 3 కోట్ల మెట్రిక్‌ టన్నుల ధాన్యం పండించి దేశంలోనే తెలంగాణను మొదటి స్థానంలో నిలిపామని రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. రైతు బంధు కింద నగదు పంపిణీ ప్రారంభమైన సందర్భంగా మంగళవారం మేడ్చల్‌ మండలం పూడూరు రైతు వేదిక వద్ద కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణీదేవితో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా క్లస్టర్లను ఏర్పాటు చేసి రూ.750 కోట్లతో 2600 రైతు వేదికలు నిర్మించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదని స్పష్టం చేశారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని