రైతుబంధు సొమ్మును పోస్టాఫీసుల్లో తీసుకోవచ్చు
close

ప్రధానాంశాలు

రైతుబంధు సొమ్మును పోస్టాఫీసుల్లో తీసుకోవచ్చు

ఈనాడు, హైదరాబాద్‌: రైతుబంధు లబ్ధిదారులు తమ బ్యాంకు ఖాతాల్లో జమ అయిన మొత్తాన్ని తపాలా కార్యాలయాల్లో తీసుకోవచ్చు. ఈ సేవల్ని ఉచితంగానే అందిస్తున్నట్లు తపాలాశాఖ శుక్రవారం ప్రకటించింది. పోస్టాఫీసుల్లోని మైక్రో ఏటీఎంల ద్వారానూ అందించాలని నిర్ణయించి, రాష్ట్రవ్యాప్తంగా 5,794 పోస్టాఫీసుల్లో ఏర్పాట్లు చేసినట్లు తెలంగాణ తపాలా సర్కిల్‌ తెలిపింది. ఆధార్‌ సంఖ్య, మొబైల్‌ఫోన్‌ నంబరుతో అనుసంధానమైన బ్యాంకు ఖాతా కలిగిన రైతులు రోజుకు గరిష్ఠంగా రూ.10వేల చొప్పున తీసుకోవచ్చని స్పష్టంచేసింది. బ్యాంకు ఖాతాతో అనుసంధానమైన మొబైల్‌ఫోన్‌ను తమ వెంట తీసుకెళ్లాలి. మైక్రో ఏటీఎంలో వేలిముద్ర వేయగానే సెల్‌ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. ఆ సంఖ్య చెప్పి నగదు తీసుకోవచ్చు.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని