పట్టణ విద్యార్థులూ వ్యవసాయ ఇంజినీరింగ్‌ చేయొచ్చు
close

ప్రధానాంశాలు

పట్టణ విద్యార్థులూ వ్యవసాయ ఇంజినీరింగ్‌ చేయొచ్చు

పీజేటీఎస్‌ఏయూ రిజిస్ట్రార్‌ వెల్లడి

రాజేంద్రనగర్‌, న్యూస్‌టుడే: ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం(పీజేటీఎస్‌ఏయూ) అందిస్తున్న వ్యవసాయ, అగ్రి ఇంజినీరింగ్‌, ఆర్గానిక్‌ డిప్లొమా కోర్సులలో ప్రవేశాలకు సంబంధించి అర్హతల్లో సడలింపులు చేసినట్లు రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎస్‌.సుధీర్‌కుమార్‌ తెలిపారు.  గతంలో కేవలం గ్రామీణ ప్రాంతాల్లో చదివిన విద్యార్థులకే ప్రవేశాలు కల్పిస్తుండగా.. ఇకపై 60 శాతం గ్రామీణ విద్యార్థులు, 40 శాతం పట్టణ ప్రాంత విద్యార్థులతో భర్తీ చేయాలని నిర్ణయించామన్నారు. నాలుగేళ్లపాటు గ్రామీణ ప్రాంతాల్లో చదివిన విద్యార్థులు మాత్రమే గ్రామీణ కోటాకు అర్హులని తెలిపారు. అలాగే గతంలో 10వ తరగతి ఉత్తీర్ణులైన వారు ఈ కోర్సులలో చేరేందుకు అర్హులు కాగా, ఇకపై ఇంటర్‌ చదివిన విద్యార్థులు సైతం పాలిసెట్లో ర్యాంకు ఆధారంగా డిప్లొమాలో ప్రవేశాలకు అర్హులుగా పరిగణిస్తామన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని