కరోనాతో అనాథలైన విద్యార్థులకు ఉచిత విద్య
close

ప్రధానాంశాలు

కరోనాతో అనాథలైన విద్యార్థులకు ఉచిత విద్య

మల్లారెడ్డి విశ్వవిద్యాలయ కులపతి డీఎన్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి, ఇంటర్మీడియట్‌లో 70 శాతానికిపైగా మార్కులు సాధించిన విద్యార్థులకు నాలుగేళ్లపాటు ఇంజినీరింగ్‌ విద్యను ఉచితంగా అందించనున్నట్లు మల్లారెడ్డి విశ్వవిద్యాలయ కులపతి డీఎన్‌ రెడ్డి తెలిపారు. మల్లారెడ్డి విశ్వవిద్యాలయంలో 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, పారామెడికల్‌ సైన్సెస్‌, మేనేజ్‌మెంట్‌ అండ్‌ పబ్లిక్‌పాలసీ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదలైందన్నారు. ఈ ఏడాది కొత్తగా 70 కోర్సులు ప్రవేశపెట్టామని శుక్రవారం ఆయన ఒక ప్రకటనలో వివరించారు. ఆర్థికంగా వెనుకబడిన, ప్రతిభ చూపిన విద్యార్థులకు రూ.75 వేల నుంచి రూ.లక్ష వరకు ఉపకార వేతనాలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని