ఆలమట్టికి 37 వేల క్యూసెక్కుల ప్రవాహం
close

ప్రధానాంశాలు

ఆలమట్టికి 37 వేల క్యూసెక్కుల ప్రవాహం

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు స్వల్పంగా పెరిగిన వరద

ఈనాడు, హైదరాబాద్‌: ఎగువన కురుస్తున్న వర్షాలకు కర్ణాటకలోని ఆలమట్టి జలాశయానికి ప్రవాహం పెరుగుతోంది. గురువారం ప్రాజెక్టులోకి వస్తున్న ప్రవాహం 13,784 క్యూసెక్కులు కాగా శుక్రవారం 37,233 క్యూసెక్కులకు చేరుకుంది. జలాశయంలో నీటి నిల్వ కూడా 24 గంటల వ్యవధిలో మూడు టీఎంసీలకు పైగా పెరిగింది. ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యం 129.72 టీఎంసీలు. తుంగభద్ర పరీవాహకంలోనూ కురుస్తున్న వర్షాలకు ఈ జలాశయంలోకి 7113 క్యూసెక్కులు వస్తున్నాయి. జూరాలకు 4640 క్యూసెక్కులు వస్తుండగా దిగువకు 6655 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయంలోకి 6070 క్యూసెక్కుల ప్రవాహం వచ్చి చేరుతోంది. గోదావరి పరీవాహకంలో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు స్వల్పంగా ప్రవాహం పెరిగింది. మహారాష్ట్రలోని ఉప నదుల ద్వారా గోదావరికి ప్రవాహం వస్తుండగా ఎస్సారెస్పీ ప్రాజెక్టు వద్ద 17615 క్యూసెక్కుల ప్రవాహం నమోదయింది. కడెం ప్రాజెక్టుకు 838 క్యూసెక్కులు వచ్చి చేరుతున్నాయి.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని