మంత్రివర్గ ఉపసంఘానికి నోడల్‌ అధికారిగా డా. టి.గంగాధర్‌
close

ప్రధానాంశాలు

మంత్రివర్గ ఉపసంఘానికి నోడల్‌ అధికారిగా డా. టి.గంగాధర్‌

ఈనాడు, హైదరాబాద్‌: వైద్యఆరోగ్యశాఖను బలోపేతం చేసేందుకు నియమించిన మంత్రివర్గ ఉపసంఘానికి నోడల్‌ అధికారిగా డాక్టర్‌ టి.గంగాధర్‌ నియమితులయ్యారు. నిమ్స్‌ నెఫ్రాలజీ విభాగాధిపతిగా ఉన్న డాక్టర్‌ గంగాధర్‌ ఇప్పటికే రాష్ట్ర కొవిడ్‌ నిపుణుల కమిటీ సభ్యుడిగా, ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రత్యేకాధికారి(ఓఎస్డీ)గా సేవలందిస్తున్నారు. తాజాగా నోడల్‌ అధికారిగా నియమితులు కావడంతో వైద్యఆరోగ్య శాఖకు, మంత్రివర్గ ఉపసంఘానికి సమన్వయాధికారిగా ఈయన వ్యవహరిస్తారని వైద్యవర్గాలు తెలిపాయి.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని