మాది ధర్మం... వారిది దాదాగిరి
close

ప్రధానాంశాలు

మాది ధర్మం... వారిది దాదాగిరి

రాయలసీమ ఎత్తిపోతలపై మంత్రి నిరంజన్‌రెడ్డి వ్యాఖ్యలు
హక్కులో ఒక చుక్క నీటినీ కోల్పోవడానికి సిద్ధంగాలేమని స్పష్టం

ఉండవల్లి, న్యూస్‌టుడే: ‘మేం ధర్మానికి కట్టుబడి ఉంటే అవతలి వారు దాదాగిరి చేస్తామన్నట్లుగా ప్రవరిస్తున్నారు’ అని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ధ్వజమెత్తారు. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండల కేంద్రంలో శుక్రవారం పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆయన ఏపీ చేపట్టిన రాయలసీమ (సంగమేశ్వరం) ఎత్తిపోతల అంశాన్ని ప్రస్తావించారు. అన్ని అనుమతులు వచ్చేవరకు పనులు మొదలు పెట్టబోమని చెప్పిన ఏపీ ప్రభుత్వం యథావిధిగా నిర్మాణం కొనసాగిస్తోందని ఆరోపించారు. ‘‘దిగువన ఉన్నాం కదా నీళ్లు చేరినాక శ్రీశైలం నుంచి గుంజేస్తే సరిపోతుందనుకుంటున్నారు. తెలంగాణ ఎగువన ఉందని గుర్తుంచుకోవాలి. మేం తలుచుకుంటే కిందికి ఎన్ని నీళ్లు పోతాయో ఎన్ని పోవో శాసించగలం’ అన్నారు. అయినా ధర్మం పాటిస్తూ రాజ్యాంగాన్ని, విభజన చట్టాలను, కృష్ణా బోర్డును గౌరవిస్తున్నామని పేర్కొన్నారు. కృష్ణా నీటిలో న్యాయబద్ధమైన ఒక చుక్క హక్కును కూడా కోల్పోవడానికి సిద్ధంగా లేమన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని