అడవిలో అవ్వ ఇక లేరు
close

ప్రధానాంశాలు

అడవిలో అవ్వ ఇక లేరు

అనారోగ్యంతో ఆదివాసీ వృద్ధురాలి మృతి

ఊరికి దూరంగా.. అడవితల్లి ఒడిలో ఏళ్లుగా జీవనం సాగిస్తున్న ఆదివాసీ వృద్ధురాలు పూసం గిరిజాబాయి(85) ఇకలేరు. వన్యప్రాణుల మధ్య 32 ఏళ్లుగా అడవిలో ఒంటరిగా ఉంటున్న ఆమె అనారోగ్యంతో శుక్రవారం మృతిచెందారు. 52 ఏళ్ల క్రితం గిరిజాబాయి ఆదిలాబాద్‌ జిల్లాలోని నార్నూర్‌ మండలం ఖైరదట్వా నుంచి బతుకుదెరువు కోసం భర్త జైతుతో వచ్చి ఉట్నూరు మండలం కాన్నాపూర్‌ అటవీ ప్రాంతంలో స్థిరపడ్డారు. కొంతకాలానికే భర్త అనారోగ్యంతో చనిపోయారు. అనంతరం కుమారుడు రాముతో కలిసి పోడు సాగు చేస్తూ జీవనం సాగించారు. 32 ఏళ్ల క్రితం అతనూ మరణించడంతో అప్పటి నుంచి కన్నాపూర్‌ రాజులమడుగు అటవీ ప్రాంతంలోని ఓ చెట్టు కింద స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారు. అడవిలో దొరికే కందలు, గడ్డలు తింటూ జీవనం సాగిస్తున్నారు. ఆమెకు గోండు భాష మాత్రమే తెలుసు.

-న్యూస్‌టుడే, ఉట్నూరు గ్రామీణం


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని