ఆర్‌జీయూకేటీలోనూ ఈడబ్ల్యూఎస్‌ కోటా
close

ప్రధానాంశాలు

ఆర్‌జీయూకేటీలోనూ ఈడబ్ల్యూఎస్‌ కోటా

10%  రిజర్వేషన్‌ కింద పెరగనున్న 150 సీట్లు

ఈనాడు, హైదరాబాద్‌: బాసరలోని రాజీవ్‌గాంధీ సాంకేతిక, వైజ్ఞానిక విశ్వవిద్యాలయం (ఆర్‌జీయూకేటీ)లో కొత్తగా 150 సీట్లు పెరగనున్నాయి. కొత్త విద్యా సంవత్సరం (2021-22)లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్‌)కు కోటా అమలు చేయనుండటమే దీనికి కారణం. అది ఆర్‌జీయూకేటీలోని ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌ కోర్సుకూ వర్తిస్తుందని విద్యాశాఖ వర్గాలు స్పష్టంచేస్తున్నాయి. ప్రస్తుతం విశ్వవిద్యాలయంలో 1,500 సీట్లున్నాయి. ఈ ప్రకారం ఈడబ్ల్యూఎస్‌కు 10 శాతం (150) సీట్లు కొత్తగా అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం పాలిసెట్‌ ద్వారా ప్రవేశాలు కల్పించాలని వర్సిటీ నిర్ణయించింది. త్వరలోనే విధివిధానాలపై నిర్ణయం తీసుకుంటామని వర్సిటీ ఇన్‌ఛార్జి ఉపకులపతి రాహుల్‌ బొజ్జా తెలిపారు.

ప్రవేశాల నాటికి నిబంధనలు
కేవలం పాలిసెట్‌ ర్యాంకు ఆధారంగానే ఆర్‌జీయూకేటీలో సీట్లను భర్తీ చేయరని తెలుస్తోంది. సాధారణంగా పదో తరగతిలో గ్రేడ్‌ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. హాస్టళ్లు లేని సాధారణ ప్రభుత్వ బడుల్లో చదివిన వారికి అదనంగా 0.40 స్కోర్‌ను పదో తరగతి జీపీఏకి కలిపి ప్రవేశాలు ఇస్తారు. ఇప్పుడు కేవలం పాలిసెట్‌ ర్యాంకు ఆధారంగా కల్పిస్తే సర్కారు పాఠశాలల విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉంది. అందుకే పాలిసెట్‌లో దక్కిన ర్యాంకుతోపాటు ప్రభుత్వ బడుల్లో చదివిన వారికి కొంత వెయిటేజీ ఇచ్చి సీట్లను భర్తీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని