పద్మారావుకు బిషప్‌గా పట్టాభిషేకం
close

ప్రధానాంశాలు

పద్మారావుకు బిషప్‌గా పట్టాభిషేకం

డోర్నకల్‌, న్యూస్‌టుడే: మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ డయోసీషన్‌ 9వ బిషప్‌గా కోడిరెక్క పద్మారావు ఆదివారం పట్టాభిషిక్తులయ్యారు. చర్చి ఆఫ్‌ సౌత్‌ ఇండియాకు చెందిన ఎపీఫనీ చర్చిలో సీనాడ్‌ మోడరేటర్‌ ఎ.ధర్మరాజ్‌ రాసలం ఆయనకు అభిషేకపత్రం అందించి బిషప్‌గా ప్రకటించారు. బిషప్‌ మాట్లాడుతూ ప్రభువు సంకల్పంతోనే ఈ బాధ్యతలు చేపట్టానని, డయోసీషన్‌ని అన్ని రంగాల్లో ముందంజలో ఉంచడమే తన లక్ష్యమన్నారు. వేడుకలో సీనాడ్‌ డిప్యూటీ మోడరేటర్‌ కె.రుబెన్‌మార్క్‌, ఎమ్మెల్సీ రాజేశ్వరరావు, వైఎంసీఏ జేకే దానియల్‌, సీఎస్‌ఐ ప్రధాన కార్యదర్శి సి.ఫెర్నాండేజ్‌ రతిన, వివిధ డయోసీషన్ల బిషప్‌లు పాల్గొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని