చెట్ల పరిరక్షణకు ట్రీ సర్జన్‌!
close

ప్రధానాంశాలు

చెట్ల పరిరక్షణకు ట్రీ సర్జన్‌!

ముంబయి విధానం అనుసరిద్దాం: మంత్రి కేటీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో కూలిపోయే దశలో ఉన్న చెట్లను పరిక్షించేందుకు ఒక వృక్ష శస్త్రచికిత్స నిపుణుడి (ట్రీ సర్జన్‌)ను నియమిస్తామని తెలంగాణ పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీ రామారావు తెలిపారు. దీనిపై చర్యలు తీసుకోవాలని ఆయన రాష్ట్ర పురపాలక ముఖ్యకార్యదర్శి అర్వింద్‌కుమార్‌ను ఆదేశించారు. ముంబయి మహానగరపాలక సంస్థ చెట్లు పడిపోకుండా భౌతికంగా కాపాడేందుకు ప్రయోగాత్మక ప్రాజెక్టును చేపట్టిందని, ఆయా చెట్ల పరిస్థితులను నమోదు చేసి వాటిని కాపాడామని స్థానిక అధికారి చెప్పిన అంశాన్ని ఒక నెటిజన్‌ ఆదివారం కేటీఆర్‌కు ట్విటర్‌ ద్వారా తెలియజేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను సైతం జత చేశారు. మంత్రి వెంటనే స్పందించి రాష్ట్రంలో కూడా వృక్ష పరిరక్షణకు కార్యాచరణ ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ దార్శనికత ఆయన నాయకత్వ సామర్థ్యంతో వాస్తవరూపం దాల్చిందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. దేశంలోని చిరుప్రాయం గల రాష్ట్రమైన తెలంగాణ సీఎం సారథ్యంలో ప్రపంచంలోనే అతి పెద్దదైన బహుళార్థసాథక ఎత్తిపోతల ప్రాజెక్టునును నిర్మించుకుందని తెలిపారు. దీనిపై డిస్కవరి చానల్‌  ఈ నెల 25న రాత్రి 8.30కి ప్రసారం చేసే డాక్యుమెంటరీని అంతా తిలకించాలని ఆయన కోరారు.

ఆ పిల్లలను ఆదుకుంటాం
వరంగల్‌ గ్రామీణ జిల్లా నర్సంపేట మండలం లక్నెపల్లి గ్రామంలో తల్లిదండ్రులను కోల్పోయిన ఇద్దరు పిల్లలను ఆదుకుంటామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు.  దళిత కుటుంబానికి పిల్లల తల్లి పదేళ్ల క్రితం చనిపోగా... తండ్రి నాలుగు రోజుల క్రితం మరణించారని, ఇద్దరు పిల్లలు అనాథలయ్యారని ఒక నెటిజన్‌ ట్విటర్‌లో కేటీఆర్‌కు తెలిపారు. దీనిపై మంత్రి స్పందించి, వెంటనే వారికి వివరాలు సేకరించాలని తమ కార్యాలయ అధికారులను ఆదేశించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని