తుంగభద్రకు 42 వేల క్యూసెక్కుల రాక
close

ప్రధానాంశాలు

తుంగభద్రకు 42 వేల క్యూసెక్కుల రాక

కాళేశ్వరం ఎత్తిపోతల్లో ఏకకాలంలో నడుస్తున్న 31 పంపులు

ఈనాడు, హైదరాబాద్‌: కృష్ణా, తుంగభద్ర నదుల్లో ఎగువన వరద క్రమంగా పెరుగుతోంది. కర్ణాటకలో వర్షాలు విస్తారంగా కురుస్తుండటంతో ఆలమట్టికి ఆదివారం 1.50 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. 24 గంటల వ్యవధిలో జలాశయంలో 13 టీఎంసీల నిల్వ పెరిగింది. తుంగభద్ర జలాశయానికి రోజు వ్యవధిలో 21 వేల క్యూసెక్కులకుపైగా పెరిగింది. ప్రస్తుతం 42వేల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. జూరాల జలాశయానికి ప్రవాహం తగ్గింది. శ్రీశైలానికి 4256 క్యూసెక్కులు వస్తుండగా విద్యుత్‌ ఉత్పత్తి అనంతరం దిగువకు 3570 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. 

కాల్వలకు ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల
ఎగువ నుంచి ప్రవాహం వస్తున్న నేపథ్యంలో జూరాల జలాశయం నుంచి 2593 క్యూసెక్కులు, శ్రీపాద ఎల్లంపల్లి నుంచి 9859 క్యూసెక్కులు, నాగార్జునసాగర్‌ నుంచి 500 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల్లో భాగంగా జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా లక్ష్మీ బ్యారేజీ (మేడిగడ్డ) నుంచి రోజుకు దాదాపు రెండు టీఎంసీల నీటిని ఎగువకు ఎత్తిపోస్తున్నారు. ఈ ప్రాజెక్టు పరిధిలోని 31 పంపులను ఏకకాలంలో నడుపుతున్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని