పీవీ విగ్రహం సిద్ధం
close

ప్రధానాంశాలు

పీవీ విగ్రహం సిద్ధం

28న ప్రారంభించనున్న సీఎం

తెలుగు నేల ఖ్యాతిని దేశవ్యాప్తంగా చాటిన మాజీ ప్రధాని పీవీ ఠీవి కనిపించేలా కాంస్య ప్రతిమ రూపుదిద్దుకుంటోంది. అమెరికా నుంచి తెప్పించిన సీఎన్‌సీ యంత్రం సాయంతో లేజర్‌ సాంకేతికత వినియోగించి పీవీ ముఖాన్ని అచ్చు గుద్దినట్లు సిద్ధంచేస్తున్నారు. ఈ నెల 28న పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్‌ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. హైదరాబాద్‌ నెక్లెస్‌ రోడ్డును ఇప్పటికే పీవీఎన్‌ఆర్‌ మార్గ్‌గా మార్చుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మార్గం ప్రారంభ ప్రదేశంలోనే విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు.  విగ్రహం తయారీలో 85 శాతం కాపర్‌, 5 శాతం జింక్‌, 5 శాతం టిన్‌, మరో 5 శాతం లెడ్‌ను వినియోగించారు. తొలుత వేర్వేరు భాగాలుగా సిద్ధం చేసి.. ఒక చోట చేర్చి పీవీ ఆకారాన్ని తెచ్చారు. 16 అడుగుల ఎత్తు, 2 టన్నుల బరువు ఉండనుంది. దాదాపు రూ. 27 లక్షలు వెచ్చించి 15 మంది కళాకారులు 17 రోజుల్లో విగ్రహాన్ని తయారుచేశారు.

- న్యూస్‌టుడే, ఖైరతాబాద్‌


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని