తెలంగాణ చరిత్రలో చిరస్మరణీయుడు
close

ప్రధానాంశాలు

తెలంగాణ చరిత్రలో చిరస్మరణీయుడు

జయశంకర్‌కు సీఎం నివాళులు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ స్వయం పాలనా స్వాప్నికుడు, స్వరాష్ట్రం కోసం సాగిన ఉద్యమాల్లో భావజాల వ్యాప్తికి జీవితాంతం కృషి చేసిన ఆచార్య జయశంకర్‌, రాష్ట్ర చరిత్రలో చిరకాలం నిలిచిపోతారని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ వర్ధంతి సందర్భంగా సీఎం ఆయనకు నివాళులర్పించారు.జయశంకర్‌ ఆశయాలను తమ ప్రభుత్వం కార్యాచరణలో పెడుతోందని, ఆయన ఆలోచనలకు అనుగుణంగానే సబ్బండ వర్గాలు స్వయంసమృద్ధిని సాధిస్తున్నాయని సీఎం పేర్కొన్నారు. ఒక్కో రంగాన్ని సరిదిద్దుకుంటూ, ఇతర రాష్ట్రాలతో పోటీ పడుతూ, అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ తద్వారా తెలంగాణ జయశంకర్‌కు ఘననివాళి అర్పిస్తోందని తెలిపారు. మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌లు జయశంకర్‌ సేవలను ప్రస్తుతించారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, తెలంగాణభవన్‌లో తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, మంత్రి మహమూద్‌ అలీ తదితరులు నివాళులర్పించారు.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని