తమిళనాడు సీఎం స్టాలిన్‌తో తమిళిసై భేటీ
close

ప్రధానాంశాలు

తమిళనాడు సీఎం స్టాలిన్‌తో తమిళిసై భేటీ

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ గవర్నర్‌ తమిళిసై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ను  చెన్నైలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాజ్‌భవన్‌లో పండించిన మామిడి పండ్లను స్టాలిన్‌కు అందజేశారు. పుదుచ్చేరి విమానాశ్రయ విస్తరణకు 200 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని కోరారు. దీని ద్వారా తమిళనాడు సరిహద్దు జిల్లాల ప్రజలకు కూడా ఎంతో ఉపయోగమని ఆమె తెలిపారు. సమావేశంలో మాజీ కేంద్రమంత్రి టీఆర్‌ బాలు కూడా పాల్గొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని