సాహితీ పురస్కారాలకు ఉత్తమ రచనలు సూచించండి
close

ప్రధానాంశాలు

సాహితీ పురస్కారాలకు ఉత్తమ రచనలు సూచించండి

నారాయణగూడ, న్యూస్‌టుడే: తెలుగు సాహిత్యంలో వివిధ ప్రక్రియల్లో ఉత్తమ రచనల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఏటా సాహితీ పురస్కారాలను ప్రదానం చేస్తోంది. 2018 సంవత్సరానికి ప్రదానం చేసే పురస్కారాల ఎంపిక కోసం ఉత్తమ రచనలను సూచించాలని వర్సిటీ రిజిస్ట్రార్‌ మంగళవారం ఓ ప్రకటనలో కోరారు. ‘2018 పురస్కారాల ఎంపిక కోసం 2019 అక్టోబరులోనే వర్సిటీ వివిధ వర్గాల నుంచి సూచనలు కోరింది. అనివార్య కారణాలతో పురస్కారాల ఎంపిక జరగలేదు. ప్రస్తుతం పురస్కారాల ఎంపిక ప్రక్రియను మళ్లీ చేపట్టినట్లు’ రిజిస్ట్రార్‌ తెలిపారు. పాఠకులు తెల్లకాగితంపై తమ సూచనల్ని రాసి రిజిస్ట్రార్‌, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్‌-04 చిరునామాకు జులై 15లోగా పంపాలని సూచించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని