‘సరస్వతి’ లీజు పునరుద్ధరణ ఉత్తర్వులు నిలపండి
close

ప్రధానాంశాలు

‘సరస్వతి’ లీజు పునరుద్ధరణ ఉత్తర్వులు నిలపండి

ఎంపీ రఘురామకృష్ణరాజు అప్పీలు

ఈనాడు, అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన భార్య భారతి వాటా కలిగి ఉన్న సరస్వతి పవర్‌ సున్నపురాయి మైనింగ్‌ లీజు పునరుద్ధరణకు అనుమతిస్తూ హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టు ధర్మాసనంలో అప్పీలు చేశారు. 2019 అక్టోబరు 15న సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల అమలును నిలిపేయాలని కోరారు. సింగిల్‌ జడ్జి ఆదేశాల ఆధారంగా సరస్వతి పవర్‌ ఇండస్ట్రీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు (ఎస్‌పీఐపీఎల్‌) మైనింగ్‌ లీజును పునరుద్ధరిస్తూ పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి.. 2019 డిసెంబరు 12న ఇచ్చిన జీవో 109, అధికారాన్ని మోసపూరితంగా ఉపయోగించి ముఖ్యమంత్రికి చెందిన కంపెనీకి అనుచిత లబ్ధి చేకూర్చడం కోసం నీటి కేటాయింపు, మైనింగ్‌ లీజును 30 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పొడిగిస్తూ ఇచ్చిన జీవోల అమలును నిలిపివేయాలని కోరారు.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని