శ్రీవారి దర్శన టికెట్ల కోటా 2 గంటల్లో పూర్తి
close

ప్రధానాంశాలు

శ్రీవారి దర్శన టికెట్ల కోటా 2 గంటల్లో పూర్తి

తిరుమల, న్యూస్‌టుడే: కరోనా తగ్గుముఖం పడుతున్నవేళ శ్రీవారి దర్శనానికి వచ్చేందుకు భక్తులు ఆసక్తి చూపుతున్నారు. జులై నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను మంగళవారం ఉదయం 9గంటలకు తితిదే ఆన్‌లైన్‌లో విడుదల చేయగా 11 గంటల కల్లా టికెట్లన్నింటినీ భక్తులు కొనుగోలు చేశారు. రెండు రోజులు (13, 16 తేదీలు) మినహా నెల మొత్తం టికెట్లు రెండు గంటల్లోనే అయిపోయాయి. రోజుకు 5వేల చొప్పున టికెట్లను తితిదే విడుదల చేసింది. బుధవారం ఉదయం 9 గంటలకు జులై నెలకు గదుల కోటాను తితిదే ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని