నల్గొండలో 40 డిగ్రీల ఉష్ణోగ్రత
close

ప్రధానాంశాలు

నల్గొండలో 40 డిగ్రీల ఉష్ణోగ్రత

ఈనాడు, హైదరాబాద్‌: రుతుపవనాల్లో కదలికలు లేకపోవడంతో భానుడి సెగలు పెరుగుతున్నాయి. మంగళవారం పగలు అత్యధికంగా నల్గొండలో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇది సాధారణం కన్నా 4.2 డిగ్రీలు అధికమని వాతావరణ శాఖ తెలిపింది. పలు ప్రాంతాల్లో 37 నుంచి 40 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బంగాళాఖాతంలో 2.1 కిలోమీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో బుధ, గురువారాల్లో అక్కడక్కడ ఒక మాదిరి వర్షాలు కురిసే అవకాశాలున్నాయి.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని