విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలకు ఆస్కారం ఇవ్వొద్దు
close

ప్రధానాంశాలు

విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలకు ఆస్కారం ఇవ్వొద్దు

ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకరరావు

ఈనాడు, హైదరాబాద్‌: కోట్లాది రూపాయలు వెచ్చించి వ్యవస్థను మెరుగుపరిచినా.. వానాకాలంలో తరచూ విద్యుత్‌ సరఫరాలో అంతరాయం కలుగుతుండటంపై ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకరరావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏడీఈ స్థాయి వరకూ సిబ్బందితో ఆయన మంగళవారం సమీక్ష నిర్వహించారు. లైన్‌ క్లియరెన్సుల వల్ల, ట్రిప్‌ కావటం వల్ల సరఫరా నిలిచిపోయి వినియోగదారులు అసౌకర్యానికి గురవుతున్నారని, వారికి సమాచారం కూడా ఉండటం లేదని సీఎండీ పేర్కొన్నారు. ఇకపై ఇలాంటి పరిస్థితి ఎదురైతే సంబంధిత ఏఈ, ఏడీఈ, డీఈలు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. 1912 కంట్రోల్‌ రూంలను పటిష్ఠపరిచి, వినియోగదారులు తమ సమస్యలు తెలియజేసే అవకాశం కలిగించాలని ఆదేశించారు.‘ఈనాడు’లో ప్రచురితమైన ‘మ్యాపింగ్‌ ఘనం.. సమాచారలోపం’ కథనాన్ని సీఎండీ ప్రస్తావించారు. కొందరు సిబ్బంది అంచనా వ్యయాలను పెంచి అవకతవకలకు పాల్పడుతున్నారని.. దీన్ని సహించేది లేదని సీఎండీ చెప్పారు.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని