మరో రూ.1000 కోట్ల రుణం
close

ప్రధానాంశాలు

మరో రూ.1000 కోట్ల రుణం

జూన్‌లో అత్యధికంగా రూ.7,500 కోట్లు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం బాండ్ల విక్రయం ద్వారా మరో రూ.1000 కోట్ల రుణాన్ని సమీకరించుకుంది. మంగళవారం ఆర్‌బీఐ ద్వారా 20 ఏళ్ల కాల పరిమితితో కూడిన బాండ్లను వేలం వేసింది. తాజాగా తీసుకున్న దానితో కలిపి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకూ తీసుకున్న మొత్తం రూ.12,500 కోట్లకు చేరింది. ఏప్రిల్‌లో రూ.1,500 కోట్లు, మే నెలలో రూ.3,500 కోట్లను రుణంగా పొందింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో మే, జూన్‌ నెలల్లో రాష్ట్ర ఆదాయం తగ్గినందున..ఈ నెలలో అత్యధికంగా రూ.7,500 కోట్ల అప్పు తీసుకుంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో బాండ్ల వేలం ద్వారా మొత్తం రూ.47,500 కోట్లను రుణంగా తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని