పలు రైళ్ల రద్దు
close

ప్రధానాంశాలు

పలు రైళ్ల రద్దు

ఈనాడు, హైదరాబాద్‌: విజయవాడ-విశాఖపట్టణం సెక్షన్‌ల మధ్య జరిగే పనుల్ని దృష్టిలో పెట్టుకుని ఎనిమిది రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. ఈ నిర్ణయంతో కొన్ని రైళ్లు నాలుగురోజుల పాటు మరికొన్ని ఆరు, ఎనిమిది రోజుల పాటు ప్రయాణికులకు అందుబాటులో ఉండవు. ఈ మేరకు ద.మ.రైల్వే మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. విశాఖపట్నం-లింగంపల్లి (02831) ఎక్స్‌ప్రెస్‌ ఈనెల 27 నుంచి 29, జులై 4-6 మధ్య, లింగంపల్లి-విశాఖపట్నం (02832) ఎక్స్‌ప్రెస్‌ ఈనెల 28-30, జులై 5-7 మధ్య రద్దు చేశారు. విశాఖపట్నం-విజయవాడ (నెం.02717) రైలును ఈనెల 28 నుంచి 29, జులై 5 నుంచి 6 వరకు, విజయవాడ-విశాఖపట్నం (02718) రైలు ఈనెల 28-29,  జులై 5-6 మధ్య నిలిపివేస్తారు. విశాఖపట్నం-గుంటూరు (07240) ఈనెల 28-30, జులై 5-7, గుంటూరు-విశాఖపట్నం (07239) 27-29, జులై 4-6, విశాఖపట్నం-కడప (07488) 26-29, జులై 3-6, కడప-విశాఖపట్నం (07487) 27-30, జులై 4-7 తేదీల్లో రద్దు చేశారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని