ఆగస్టులో మానేరు తీర ప్రాంత అభివృద్ధి పనుల ప్రారంభం: మంత్రి గంగుల
close

ప్రధానాంశాలు

ఆగస్టులో మానేరు తీర ప్రాంత అభివృద్ధి పనుల ప్రారంభం: మంత్రి గంగుల

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం కరీంనగర్‌లో సుమారు రూ.400 కోట్లతో చేపట్టిన మానేరు తీర ప్రాంత (రివర్‌ ఫ్రంట్‌) అభివృద్ధి ప్రాజెక్టు పనులు ఆగస్టులో ప్రారంభవుతాయని రాష్ట్ర పౌరసరఫరాలు, బీసీ సంక్షేమ శాఖల మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు. ఆగస్టులో రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణంతో పాటు ఇతర సివిల్‌ వర్క్‌లకు టెండర్లు పిలిచి సంవత్సరం లోపల పూర్తిచేస్తామన్నారు. ప్రాజెక్టు బృహత్తర ప్రణాళిక (మాస్టర్‌ ప్లాన్‌), సమగ్ర నివేదిక (డీపీఆర్‌) వచ్చే నెలలో సిద్ధమవుతాయని పేర్కొన్నారు. నిర్మాణ పనుల డీపీఆర్‌ తయారీకి టెండర్‌ నోటిఫికేషన్‌ సైతం జారీ అయిందని.. ప్రాజెక్టు ఇంజినీరింగ్‌, ఆర్కిటెక్చరల్‌ ఆకృతుల కోసం వెంటనే టెండర్లు పిలుస్తున్నట్లు వెల్లడించారు. ప్రాజెక్టు పురోగతిపై మంగళవారం హైదరాబాద్‌లోని జలసౌధలో మంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ కుమార్‌, ఈఎన్సీలు మురళీధర్‌రావు, శంకర్‌, ఎస్‌ఈ శివకుమార్‌, పర్యాటక సంస్థ ఎండీ మనోహర్‌, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని