టీఎస్‌ఐసెట్‌ గడువు పొడిగింపు
close

ప్రధానాంశాలు

టీఎస్‌ఐసెట్‌ గడువు పొడిగింపు

కేయూ క్యాంపస్‌, న్యూస్‌టుడే: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో 2021-22 విద్యాసంవత్సరం ప్రవేశాల కోసం కాకతీయ విశ్వవిద్యాలయం నిర్వహించే టీఎస్‌ఐసెట్‌-2021 దరఖాస్తు గడువును మరోసారి పొడిగించారు. ఈ మేరకు ఐసెట్‌ కన్వీనర్‌, కేయూ వాణిజ్యశాస్త్రం ఆచార్యుడు కె.రాజిరెడ్డి బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గతంలో ప్రకటించిన ప్రకారం దరఖాస్తుకు తుది గడువు బుధవారం(23) కాగా.. విద్యార్థుల అభ్యర్థన మేరకు ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా ఈనెల 30వ తేదీ వరకు గడువును పొడిగించినట్లు తెలిపారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని