శంషాబాద్‌లో ఈ-బోర్డింగ్‌ సౌకర్యం విస్తరణ
close

ప్రధానాంశాలు

శంషాబాద్‌లో ఈ-బోర్డింగ్‌ సౌకర్యం విస్తరణ

ఈనాడు, హైదరాబాద్‌: శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ-బోర్డింగ్‌ సదుపాయాన్ని విస్తరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ విధానంలో ప్రయాణికులు కాగితం అవసరం లేకుండా.. తమ చరవాణిలోని ఎలక్ట్రానిక్‌ బోర్డింగ్‌ పాస్‌ను ఉపయోగించి ప్రయాణించవచ్చు. బోర్డింగ్‌ గేట్ల వద్ద క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేస్తే సరిపోతుంది. ఎయిరిండియా, ఇండిగో, విస్తారా, స్సైస్‌జెట్‌, ఎమిరేట్స్‌, గో ఎయిర్‌ సంస్థలు అంతర్జాతీయ ప్రయాణికుల కోసం ఇప్పటికే ఈ విధానాన్ని వినియోగిస్తున్నాయి. మిగిలిన సంస్థలు దశలవారీగా అందుబాటులోకి తీసుకురానున్నాయి. కరోనా నేపథ్యంలో కాంటాక్టు లెస్‌ ప్రయాణానికి ప్రయాణికులు మొగ్గు చూపుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని విమానాశ్రయంలోని అన్ని గేట్ల వద్ద ఈ-బోర్డింగ్‌కు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ అవకాశం కల్పించిన విమానాశ్రయం దేశంలో హైదరాబాద్‌ ఒక్కటే కావడం విశేషం. టెర్మినల్‌ ప్రవేశం నుంచి బోర్డింగ్‌ బ్రిడ్జి చెక్‌ వరకు అన్ని ప్రాంతాల్లోనూ ఈ-బోర్డింగ్‌ అందుబాటులో ఉంది. కొవిడ్‌ నిబంధనల అమలుకు పోలీసులకు సహాయంగా విమానాశ్రయ అధికారులు సర్వైలెన్స్‌ బృందాలు ఏర్పాటు చేశారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని