పొరుగు సేవల ద్వారా 3,035 మంది నియామకం
close

ప్రధానాంశాలు

పొరుగు సేవల ద్వారా 3,035 మంది నియామకం

ఈనాడు, హైదరాబాద్‌: కొత్తగా ఏర్పాటు చేసిన ఏడు ప్రభుత్వ వైద్య కళాశాలలు, 15 నర్సింగ్‌ కాలేజీల్లో పొరుగు సేవల ద్వారా సిబ్బంది నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు వైద్య కళాశాలల్లో 2,135 మంది, నర్సింగ్‌ కాలేజీల్లో 900 మంది నియామకానికి ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి డి.రోనాల్డ్‌రోస్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకూ వీరి సేవలను ఉపయోగించుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సంగారెడ్డి, మహబూబాబాద్‌, మంచిర్యాల, వనపర్తి, కొత్తగూడెం, జగిత్యాల, నాగర్‌కర్నూల్‌ వైద్య కళాశాలల్లో ఒక్కో కళాశాలకు 305 మంది చొప్పున మొత్తం 2,135 మందిని నియమించనున్నారు.

కొత్తగా ఏర్పాటు చేసిన 13 నర్సింగ్‌ కళాశాలలతో పాటు ఇప్పటికే ఉన్న రెండింటిని కలుపుకొని ప్రతి నర్సింగ్‌ కళాశాలకు 60 మంది చొప్పున మొత్తం 900 మంది నియామకానికి అనుమతి ఇచ్చారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని