ఎస్సీ గురుకుల కళాశాలల్లో ప్రవేశాలకు ఎంపిక జాబితా వెల్లడి
close

ప్రధానాంశాలు

ఎస్సీ గురుకుల కళాశాలల్లో ప్రవేశాలకు ఎంపిక జాబితా వెల్లడి

జులై 5లోపు చేరాలని సొసైటీ సూచన

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ఎస్సీ గురుకుల జూనియర్‌ కళాశాలల్లో 2021-22 విద్యాసంవత్సరానికి ఇంటర్‌ మొదటి ఏడాదిలో ప్రవేశానికి ఎంపికైన అభ్యర్థుల జాబితాను గురుకుల సొసైటీ ప్రకటించింది. ఎంపికైన అభ్యర్థులు ఈ నెల 25 నుంచి జులై 5 వరకు సంబంధిత కళాశాలల్లో ప్రవేశాలు పొందాలని సూచించింది. విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు, హాల్‌ టికెట్‌, అడ్మిషన్‌ పత్రం, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, పాస్‌పోర్ట్‌ సైజు ఫొటోలు తీసుకెళ్లాలని తెలిపింది. గడువులోగా చేరని అభ్యర్థుల సీట్లు రద్దుచేస్తామని గురుకుల సొసైటీ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్‌ స్పష్టం చేశారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని