ఉస్మానియాలో ‘స్కిన్‌ బ్యాంకు’
close

ప్రధానాంశాలు

ఉస్మానియాలో ‘స్కిన్‌ బ్యాంకు’

ఉస్మానియా ఆసుపత్రి, న్యూస్‌టుడే: తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా ఉస్మానియా ప్రభుత్వ బోధనాసుపత్రిలో ‘చర్మనిధి’ (స్కిన్‌ బ్యాంకు) ప్రారంభానికి సన్నాహాలు పూర్తికావచ్చాయి. రోటరీ క్లబ్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ  సహకారంతో, వైద్యశాఖ ఉన్నతాధికారుల చొరవతో ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చింది. స్కిన్‌ బ్యాంకు ఏర్పాటుకు  సదరు సంస్థ సుమారు రూ.60 లక్షలు వెచ్చించి మౌలిక సదుపాయాలు కల్పించింది. ఈ నెల 28న హోం మంత్రి మహమూద్‌ అలీ చేతులమీదుగా ఈ బ్యాంక్‌ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మృతుల శరీరాల నుంచి చర్మాన్ని సేకరించి ఇక్కడ భద్రపరుస్తారు. అగ్ని ప్రమాదాలు, విద్యుదాఘాతం వల్ల శరీరం కాలిపోయిన వారికి ఆ చర్మాన్ని అమర్చుతారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని