ఎంపీ రఘురామ అనుబంధ  పిటిషన్లో కౌంటరు వేయండి
close

ప్రధానాంశాలు

ఎంపీ రఘురామ అనుబంధ  పిటిషన్లో కౌంటరు వేయండి

ఏపీ ప్రభుత్వం, సరస్వతి పవర్‌లకు హైకోర్టు ఆదేశం

ఈనాడు, అమరావతి: సరస్వతి పవర్‌ కేసులో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులను హైకోర్టు ఆదేశించింది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన భార్య భారతి వాటాలు కలిగిన సరస్వతి పవర్‌ సంస్థకు సున్నపురాతి మైనింగ్‌ లీజు పునరుద్ధరణకు అనుమతిస్తూ హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పుపై అప్పీలు వేయడానికి అనుమతించాలని ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లో ఈ మేరకు నోటీసులు జారీచేసింది. విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు నోటీసులు జారీచేసిన వారిలో సరస్వతి పవర్‌, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి, గనుల శాఖ డైరెక్టర్‌ తదితరులు ఉన్నారు. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే గోస్వామి, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ ఆదేశాలిచ్చింది. సరస్వతి పవర్‌ విషయంలో హైకోర్టు సింగిల్‌ జడ్జి తీర్పును సవాలు చేస్తూ ఎంపీ రఘురామకృష్ణరాజు అప్పీలు చేశారు.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని