పెట్టుబడులపై వాస్తవాలను తొక్కిపెట్టిన సీబీఐ
close

ప్రధానాంశాలు

పెట్టుబడులపై వాస్తవాలను తొక్కిపెట్టిన సీబీఐ

జగతి పబ్లికేషన్స్‌ వాదన

ఈనాడు, హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తుల వ్యవహారంలో రాంకీ కేసులో పెట్టుబడులకు సంబంధించి తమ ముందుకొచ్చిన కీలకమైన ఆధారాలను కోర్టు దృష్టికి తీసుకురావడంలో సీబీఐ విఫలమైందని సీబీఐ కోర్టుకు జగతి పబ్లికేషన్స్‌ నివేదించింది. జగతి పబ్లికేషన్స్‌లో ఈఆర్‌ఈఎస్‌ ప్రాజెక్ట్స్‌, టీడబ్ల్యూసీ ఇన్‌ఫ్రా సంస్థలు పెట్టుబడులు పెట్టాయని, ఆళ్ల రామకృష్ణారెడ్డి సూచనల మేరకు పెట్టుబడులు పెట్టినట్లు ఈ కంపెనీల డైరెక్టర్లు వెల్లడించారని, అయితే దీనిపై రామకృష్ణారెడ్డి వివరణ తీసుకుని ఉంటే వాస్తవం వెల్లడయ్యేదని తెలిపింది. రాంకీ కేసులో మూడో నిందితుల జాబితాలో ఉన్న జగతి పబ్లికేషన్స్‌ దాఖలుచేసిన డిశ్ఛార్జి పిటిషన్‌పై సీబీఐ ప్రధాన కోర్టు న్యాయమూర్తి బి.ఆర్‌.మధుసూదన్‌రావు విచారణ చేపట్టారు. జగతి తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది సిద్దార్థ్‌ అగర్వాల్‌ వాదనలు వినిపించారు. దీనిపై తదుపరి వాదన గురువారం కొనసాగనుంది. ఇందూటెక్‌ జోన్‌కు చెందిన కేసులో  వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డితో పాటు, విజయసాయిరెడ్డి,   కార్మెల్‌ ఏసియా లిమిటెడ్‌ల తరఫున డిశ్ఛార్జి పిటిషన్లు దాఖలు చేయనున్నామని వారి తరఫు న్యాయవాది సీబీఐ కోర్టుకు తెలిపారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని