వారం రోజుల్లో తితిదే నూతన పాలకమండలి!
close

ప్రధానాంశాలు

వారం రోజుల్లో తితిదే నూతన పాలకమండలి!

ఈనాడు, అమరావతి: తితిదే నూతన పాలకమండలిని ఈ నెలాఖరులోగా నియమించే అవకాశం ఉంది. దీనిపై ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయంలో కసరత్తు వేగంగా జరుగుతున్నట్లు సమాచారం. పాలకమండలి ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డినే మళ్లీ కొనసాగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వైకాపా వర్గాలు పేర్కొంటున్నాయి. సభ్యుల విషయంలోనే మార్పులు చేర్పులున్నాయని చెబుతున్నాయి. గత పాలకమండలి కాలపరిమితి ఈ నెల 21తో ముగిసింది.  

స్పెసిఫైడ్‌ అథారిటీ ఏర్పాటు
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) పాలకమండలి గడువు ముగియడంతో స్పెసిఫైడ్‌ అథారిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం బుధవారం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనికి తితిదే ఈవోను ఛైర్మన్‌గా, అదనపు ఈవోను కన్వీనర్‌గా నియమించింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని