సహకార సంఘాలకు ‘అంబుడ్స్‌మన్‌’ను నియమించాలి
close

ప్రధానాంశాలు

సహకార సంఘాలకు ‘అంబుడ్స్‌మన్‌’ను నియమించాలి

ప్రభుత్వానికి నాబార్డు ఛైర్మన్‌ చింతల సూచన

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో సహకార సంఘాలపై వచ్చే ఫిర్యాదులను స్వీకరించి పరిష్కరించడానికి అంబుడ్స్‌మన్‌ను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వానికి నాబార్డు ఛైర్మన్‌ గోవిందరాజులు చింతల సూచించారు. నాబార్డు రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో బుధవారం ఆయన వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యవసాయ, సహకారశాఖల కార్యదర్శి రఘునందన్‌రావు, నాబార్డు రాష్ట్ర చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ వై.కృష్ణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోవిందరాజులు మాట్లాడుతూ.. కేంద్రం ప్రవేశపెట్టిన ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’ పథకం అమలుపై పర్యవేక్షణకు రాష్ట్రస్థాయి కమిటీని ఏర్పాటుచేయాలని ప్రభుత్వానికి సూచించారు. ఈ పథకం కింద బ్యాంకులిచ్చే రుణాలతో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (ప్యాక్స్‌)ను ‘బహుళ సేవా కేంద్రాలు’గా అభివృద్ధి చేయాలన్నారు. ఉదాహరణకు మామిడి పంట అభివృద్ధికి ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాను క్లస్టర్‌గా కేంద్రం ఎంపిక చేసినందున అక్కడి ‘ప్యాక్స్‌’లో మామిడి ఎగుమతులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించవచ్చన్నారు. ఆహారశుద్ధి జోన్లు, పరిశ్రమలను ఆత్మనిర్భర్‌ కింద ఏర్పాటుచేయవచ్చని పేర్కొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని