కరోనా సమయంలో జర్నలిస్టులకు రూ.5 కోట్ల సాయం: అల్లం నారాయణ
close

ప్రధానాంశాలు

కరోనా సమయంలో జర్నలిస్టులకు రూ.5 కోట్ల సాయం: అల్లం నారాయణ

ఈనాడు, హైదరాబాద్‌: కరోనా బారినపడ్డ జర్నలిస్టులకు తెలంగాణ ప్రభుత్వం రూ. 5.15 కోట్ల ఆర్థిక సాయం అందించిందని రాష్ట్ర మీడియా అకాడమీ ఛైర్మన్‌ అల్లం నారాయణ తెలిపారు. తొలివిడత కరోనా సమయంలో 1640 మందికి రూ.3.19 కోట్లు, రెండో విడతలో దాదాపు 1,958 మందికి రూ.1.96 కోట్ల సాయం అందించామన్నారు.  కొవిడ్‌తో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున సాయం అందజేస్తామని తెలిపారు. వారి కుటుంబాలకు ఐదేళ్ల పాటు నెలకు రూ.3 వేల పింఛను, 10వ తరగతిలోపు చదువుకుంటున్నవారిలో గరిష్ఠంగా ఇద్దరికి ఏడాదికి రూ.వెయ్యి చొప్పున ఉపకార వేతనం ఇస్తామని చెప్పారు. కొవిడ్‌తో మరణించిన జర్నలిస్టుల కుటుంబ సభ్యులు దరఖాస్తులను కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ, ఇంటి. నెం.10-2-1, సమాచార భవన్‌, 2వ అంతస్తు, ఏసీగార్డ్స్‌, హైదరాబాద్‌ చిరునామాకు పంపాలని కోరారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని