కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ సమావేశం 26నే
close

ప్రధానాంశాలు

కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ సమావేశం 26నే

ఈనాడు, హైదరాబాద్‌: పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ జిల్లా కలెక్టర్లతో నిర్వహించే సమావేశం 26వ తేదీకి మారింది. ముందుగా ఈ నెల 28న సమావేశం జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ రోజున దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి కార్యక్రమాలు ఉండడంతో సమావేశ తేదీని సీఎం 26కు మార్చారు. తేదీ మార్పుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. 26న ఉదయం 11 గంటలకు ప్రగతి భవన్‌లో ప్రారంభమయ్యే ఈ సమావేశానికి మంత్రులు, జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతోపాటు జిల్లా పంచాయతీ, గ్రామీణాభివృద్ధి అధికారులు హాజరుకానున్నారు. జులై 1 నుంచి 10వ తేదీ వరకు పల్లె, పట్టణప్రగతి, హరితహారం కార్యక్రమాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై సీఎం అధికారులు, ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేయనున్నారు.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని