పింఛన్‌దారులకు ఉత్తమ వైద్యసేవలు
close

ప్రధానాంశాలు

పింఛన్‌దారులకు ఉత్తమ వైద్యసేవలు

విశ్రాంత టీజీవోలతో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వ ఉద్యోగులతోపాటు  పింఛన్‌దారులకు అత్యుత్తమ సేవలను అందించేందుకు వీలుగా నగదు రహిత వైద్యసేవల పథకాన్ని ప్రభుత్వం తీర్చిదిద్దుతోందని ఆబ్కారీ, పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. బుధవారం విశ్రాంత గెజిటెడ్‌ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మోహన్‌నారాయణ, నరసరాజుల ఆధ్వర్యంలో ప్రతినిధులు యాదయ్య, రవీందర్‌ తదితరులు మంత్రిని హైదరాబాద్‌లో కలిసి వైద్యసేవల మెరుగుదలపై వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీజీవో అధ్యక్షురాలు మమత పాల్గొన్నారు.  

‘పీఆర్‌సీ అమలు చేయండి’
రాష్ట్రంలోని ఆలయాల ఉద్యోగులకు పీఆర్‌సీని అమలు చేయాలని ఆ ఉద్యోగుల ఐక్యకార్యాచరణ సమితి టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిళ్ల రాజేందర్‌, ప్రతాప్‌లను కోరింది. ఈ మేరకు ఐకాస నేతలు రాజేశ్‌బాబు, చంద్రశేఖర్‌, జె.కృష్ణ, నటరాజులు బుధవారం హైదరాబాద్‌లో  టీఎన్జీవో భవన్‌లో వినతిపత్రం సమర్పించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని