రూ.350 కోట్లతో ‘శ్రీచైతన్య ఇన్ఫినిటీ లెర్న్‌’ ప్రారంభం
close

ప్రధానాంశాలు

రూ.350 కోట్లతో ‘శ్రీచైతన్య ఇన్ఫినిటీ లెర్న్‌’ ప్రారంభం

మాదాపూర్‌, న్యూస్‌టుడే: ప్రముఖ విద్యాసంస్థ ‘శ్రీచైతన్య’ ఎడ్యుటెక్‌ ప్లాట్‌ఫాంలోకి అడుగుపెట్టింది.  రూ.350 కోట్ల పెట్టుబడితో ఇన్ఫినిటీ లెర్న్‌ పేరిట చేపట్టిన ఆన్‌లైన్‌ విద్యను గురువారం శ్రీచైతన్య విద్యాసంస్థల వ్యవస్థాపక ఛైర్మన్‌ డా.బీఎస్‌ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌ మాదాపూర్‌లోని ఆ సంస్థ కార్యాలయంలో డా.బీఎస్‌ రావు మాట్లాడుతూ, విద్యార్థులకు ఆన్‌లైన్‌ ద్వారా మెరుగైన విద్యను అందించేందుకు ఇన్ఫినిటీ లెర్న్‌ను ప్రారంభించామన్నారు. శ్రీచైతన్య విద్యాసంస్థల అకడమిక్‌ డైరెక్టర్‌, ఇన్ఫినిటీ లెర్న్‌ కో-ఫౌండర్‌ సుష్మ బొప్పన మాట్లాడుతూ, విద్యార్థుల జీవితంలో ప్రభావవంతమైన మార్పును తీసుకురావడమే ఇన్ఫినిటీ లెర్న్‌ లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో ఇన్ఫినిటీ లెర్న్‌ సీఈవో ఉజ్వల్‌సింగ్‌, శ్రీచైతన్య విద్యాసంస్థల అకడమిక్‌ డైరెక్టర్‌ సీమ బొప్పన, డైరెక్టర్‌ శ్రీధర్‌ యలమంచిలి తదితరులు పాల్గొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని