ఘనంగా పీవీ శతజయంత్యుత్సవాలు
close

ప్రధానాంశాలు

ఘనంగా పీవీ శతజయంత్యుత్సవాలు

ఈనాడు, హైదరాబాద్‌: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంత్యుత్సవాల ముగింపు వేడుకలను ఈ నెల 28న నెక్లెస్‌రోడ్‌లో ఘనంగా నిర్వహిస్తామని ఉత్సవ కమిటీ ఛైర్మన్‌, తెరాస ఎంపీ కె.కేశవరావు తెలిపారు. ఈ కార్యక్రమానికి గవర్నర్‌ తమిళిసై, సీఎం కేసీఆర్‌లు హాజరవుతారని తెలిపారు. గురువారం బీఆర్‌కేభవన్‌లో కేకే, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ సమీక్ష నిర్వహించారు. శత జయంతి వేడుకలు విజయవంతంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని