జేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ ‘చివరి’ పరీక్షలు 5 నుంచి
close

ప్రధానాంశాలు

జేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ ‘చివరి’ పరీక్షలు 5 నుంచి

ఈనాడు, హైదరాబాద్‌: జేఎన్‌టీయూ పరిధిలో బీటెక్‌, బీఫార్మసీ నాలుగో ఏడాది రెండో సెమిస్టర్‌ (4-2) పరీక్షలు జులై 5 నుంచి 14 వరకు ఆన్‌లైన్లో జరగనున్నాయి. ఈ మేరకు వర్సిటీ గురువారం కాలపట్టికను ప్రకటించింది. సుమారు 30 వేల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. విద్యార్థులు సొంతూళ్లకు దగ్గర్లోని పరీక్ష కేంద్రాలను ఎంచుకునే వీలు కల్పించి ఐచ్ఛికాలు స్వీకరించారు. మొత్తం 8 ప్రశ్నలలో ఏవైనా 5 ప్రశ్నలు రాసేందుకు విద్యార్థులకు వీలుంది. మార్చిలో వాయిదా పడిన బీటెక్‌ 3, 4 సంవత్సరాల మొదటి సెమిస్టర్‌, బీఫార్మసీ నాలుగో ఏడాది మొదటి సెమిస్టర్‌ పరీక్షలను జులై 1, 3 తేదీల్లో నిర్వహించాలని జేఎన్‌టీయూ నిర్ణయించింది. మార్చిలో పరీక్షలు రాసిన కేంద్రాల్లో, పాత హాల్‌టికెట్లతోనే ఈ పరీక్షలు రాయవచ్చని వర్సిటీ పరీక్షల విభాగం సంచాలకుడు ప్రొ.ఎం.చంద్రమోహన్‌ ప్రకటించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని