సీసీఎస్‌ నిధులు చెల్లించాలి
close

ప్రధానాంశాలు

సీసీఎస్‌ నిధులు చెల్లించాలి

ఆర్టీసీ ఎండీకి సహకార సొసైటీ విజ్ఞప్తి

ఈనాడు, హైదరాబాద్‌: సంస్థ కోసం వాడుకున్న ఆర్టీసీ సహకార సొసైటీ(సీసీఎస్‌)కి చెందిన రూ.900 కోట్ల నిధులను వెంటనే చెల్లించాలని ఆర్టీసీ సహకార సొసైటీ పాలకవర్గం డిమాండ్‌ చేసింది. ఈ మేరకు పాలకవర్గ సభ్యులు యాదగిరిరెడ్డి, పట్టాభి లక్ష్మయ్య తదితరులు ఎండీ సునీల్‌శర్మను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఆర్టీసీకి వచ్చే బ్యాంకు రుణం రూ.వెయ్యి కోట్ల నుంచి కార్మికుల రుణాలు, పదవీవిరమణ, ఇతర అవసరాల కోసం సీసీఎస్‌కు రూ.465 కోట్లు ఇవ్వాలని కోరారు. సీసీఎస్‌ సభ్యత్వాల రద్దును నివారించాలని, నెలవారీ రికవరీ నిధులు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. బ్యాంకుల నుంచి రూ.వెయ్యి కోట్లకు బదులుగా రూ.500 కోట్లు మాత్రమే వస్తున్నాయని, అందులో నుంచి సీసీఎస్‌కు నిధులు కేటాయించి ఆదుకుంటామని ఎండీ హామీ ఇచ్చారని పాలకవర్గ సభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని