రైతు చెంతకే తపాలా శాఖ
close

ప్రధానాంశాలు

రైతు చెంతకే తపాలా శాఖ

ఈనాడు, హైదరాబాద్‌: ఏరువాక పౌర్ణమి సందర్భంగా తపాలా శాఖ అన్నదాతలకు ‘రైతుబంధు’ సొమ్మును వినూత్నంగా చెల్లించింది. గురువారం పొలం పనుల్లో నిమగ్నమైన రైతుల చెంతకే గ్రామాల బ్రాంచి పోస్ట్‌మాస్టర్లు(బీపీఎం) వెళ్లి.. పెట్టుబడి సహాయాన్ని అందించారు. తెలంగాణ తపాలా సర్కిల్‌ మైక్రో ఏటీఎంల ద్వారా ఈ నెల 16 నుంచి 23 వరకు 1.08 లక్షల మంది రైతులకు రూ.66 కోట్ల మేరకు రైతుబంధు సొమ్ము చెల్లించినట్లు అసిస్టెంట్‌ డైరెక్టర్‌ జె.శ్రీనివాస్‌ తెలిపారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని