మొక్కలపై పక్షుల గూళ్లు.. కేసీఆర్‌కు అద్భుతమైన కానుక
close

ప్రధానాంశాలు

మొక్కలపై పక్షుల గూళ్లు.. కేసీఆర్‌కు అద్భుతమైన కానుక

ఎంపీ సంతోష్‌ కుమార్‌

ఈనాడు, హైదరాబాద్‌: కోటి వృక్షార్చనలో భాగంగా నాటిన మొక్కలపై పక్షులు గూళ్లను ఏర్పరుచుకోవడం హరితహారం రూపకర్త సీఎం కేసీఆర్‌కు అద్భుతమైన కానుక అని ఎంపీ సంతోష్‌కుమార్‌ గురువారం ట్విటర్‌లో తెలిపారు. ఫొటోను తన ట్వీట్‌కు జతచేశారు. కేసీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా గత ఫిబ్రవరి 17న గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ ఆధ్వర్యంలో సంతోష్‌ పిలుపు మేరకు కోటి వృక్షార్చన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా భూపాలపల్లిలో సింగరేణి సంచాలకుడు బలరామ్‌ మియావాకి పద్ధతిలో తక్కువ ప్రదేశంలో చిన్న అడవిని సృష్టించేలా మొక్కలు నాటారు. అవి పెరిగి పెద్దవై పక్షులకు, కీటకాలకు ఆవాసంగా మారాయని సంతోష్‌ వెల్లడించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని